Welcome to my blog, hope you enjoy reading
RSS

Pages

Thursday, 26 January 2012

చిరుపై విమర్శలకు పవన్ కళ్యాన్ డైలాగ్

 Share
కాంగ్రెసు పార్టీ తాజా నేత చిరంజీవిని విమర్శించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవుర్ ఫుల్ డైలాగ్‌నే ప్రత్యర్థులు వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను వల్లిస్తూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చిరంజీవిపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల్లో కాంగ్రెసు నాయకులను తిట్టడానికి వాడిన ఆ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పంచెలూడ దీసి కాంగ్రెసు నాయకులను కొడతారంటూ ఆయన వీరావేశంతో వ్యాఖ్యానించారు. పంచెలూడ దీసి కొడతామని కాంగ్రెసు నాయకులను విమర్శించిన ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ఆ కాంగ్రెసులోనే కలిసిపోయారని అంటున్నారు.

అంటే, పవన్ కళ్యాణ్ మాటలను కూడా చిరంజీవికి ఆపాదిస్తూ మాట్లాడుతున్నారన్న మాట. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అవూర్వ సహోదరులు కాబట్టి పవన్ చెప్పిన డైలాగ్‌ను తాను చెప్పలేదని చిరంజీవి అనలేరు. దాన్ని ఆసరా చేసుకుని చిరంజీవిపై విమర్శలు చేయడానికి ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ మాటలను అరువు తెచ్చుకుంటున్నారు.

0 comments:

Post a Comment